అది చిన్న పల్లెటూరు. రమారమి 70 గడపలు వుంటాయి. ఒక 10 ఇండ్లు వీరంరెడ్డి వాళ్ళవి. ఊర్లోని చాలా మందిలాగే సన్నకారు రైతులు. ఇప్పటి ప్రభుత్వాలు చెప్పే సన్నకారు కాదు, నిజంగానే 'సన్న'కారు రైతులు.
ఏమోయి బొంతా, యాడికి పోతుండావ్? రామాలయం అరుగు మీద నుంచి కొరివి మామ అడుతాంటే నా కోపం ముక్కుమీదకి కాదు ఒళ్ళంతా వచ్చింది. శాంత మూర్తి ని కాకపోయినా పెద్ద కోపిష్టిని కాను, కాని ఎవరైనా 'బొంతా' అని పిలుస్తే ఇక శివాలే.
ఎం మామ బో అరుస్సండావే, పేరు పెట్టి పిల్సలేవా అన్నాను ఎమన్నా అనుకోని లే అని.
అట్ట పిల్సాకు మని నువ్వైనా చెప్పవ్వా మామ కు అన్నా మా సీతవ్వతో. సీతవ్వ మా నాయన కు మేనత్త. మాతో పాటు మా ఇంట్లోనే వుంటది.
ఇదిగో పొట్టేలు కోసి పార్టీ ఇచ్చి అప్పుడు చెప్పు ఇట్ట పిల్సాకండి అని అప్పుడు వింటారు కాని, ఇలా అరుగు కాడ చెప్తే ఎవురు వినరబ్బాయ్ అనె చిన్నావుల అయ్య.
నా కోపం చూసి మా సీతవ్వ , ఒరేయ్ ఒక 60-70 యేండ్ల క్రితం మన ఇంటి పేరు వీరంరెడ్డి రా అన్నది . ఆ మాటను మా అవ్వ నొక్కి, గర్వం గా చెప్పటం నాకు బాగా గుర్తు.
అప్పట్లో ఇప్పుడున్నట్లు పట్టాలు, పత్రాలు లేవురా ఎప్పటికి అలా ఉండటానికి.
పిచ్చిగుంట్ల వాళ్ళు ఎప్పుడు వస్తున్నట్లే ఆ ఎండాకాలం వచ్చారు. వాళ్ళు రాముడి దగ్గరి నుంచి మొన్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దాక అన్ని బుర్రకధ లా చెప్తారు. మధ్యలో పిట్ట కథ లు చెప్తుంటారు. వాళ్ళు ఊర్లో వున్నన్ని రోజులు రోజుకో ఇంటి వాళ్ళు అన్నం పెట్టి, ఉండటానికి వసతి చూపించాలి.
మన వంతు రోజు కడుపునిండా అన్నం పెట్టి, పడుకోవటానికి మన కొట్టం చూపించాం. కింద పర్చుకోవటానికి అని బొంత ఇచ్చాం. అంతే ఆరోజు నుంచి మనల్ని బొంతోల్లు అని పిలవటం మొదలెట్టారు. మీ నాయన ఉద్యోగం వచ్చాక రికార్డు లలో కుడా అలాగే రాశారు. అలా బొంతోల్లం అయ్యాం కాని మనం వీరం రెడ్డి వాళ్ళం రా అనె.
ఇప్పుడు కొరివి మామ ఇంగా పగలబడి నవ్వే.
ఎమోబ్బ బో నవ్వు తున్డాడు గాని, కొరివి మామ కధ చెప్తాను వినరా అనె.
వీళ్ళ వంతు రోజు రాత్రి భోజనం లో నెయ్యి సరిగ్గా పడిందా లేదా అని వీళ్ళ అవ్వ కొరివి పెట్టి చూసింది అందుకే వీళ్ళు కోరివోల్లు అయ్యారు.
అదిగో ఆ మామ వాళ్ళు ఇచ్చిన పాలల్లో కొంచెం గొర్రె బొచ్చు వచ్చింది అందుకే వాళ్ళు బొచ్చోల్లు అయ్యారు.
కాకుంటే వాళ్ళు ఇంటిపేరు పొలం పట్టాలలోమారకుండా చూసుకున్నారు, మనకు అంత తెలివి లేకపోయ నాయనా అని ఒక నిట్టుర్పు విడిసింది మా అవ్వ.

ఓ సీత పెద్దమ్మ , బొంతోల్లని బొంత అనక ఏమనిపిలసాలనో నువ్వైనా చెప్పు అని పెద్దగా నవ్వే మామ. అరుగు మీదున్న అందరు నవ్వుతాంటే ఈసారి కోపం తో పాటు ఏడుపు కలిపి వచ్చింది నాకు.