Sunday 27 May 2012

మరి నా కామెంట్ కూడా విను.

జగన్ అరెస్ట్ మీద మన హీరో గారి కామెంట్ చూసా. 


 2 సంవత్సరాల క్రితం, ఈ ప్రభుత్వాన్నే పంచలు ఉడదీసి కొడతాం అంటే వోటేసిన పిచ్చోల్లం.


 సినిమా వాసన వదలక సినిమా లాగే పార్టీ ని అమ్మి ఆ పంచల పంచన చేరగానే అదో గొప్ప govt అయిందా?
 మీ చెల్లి విషయం లో ఏమి చేయలేని మీరు ఆడిపోసుకుంది ఈ govt నే. 
 అవినీతి , అక్రమం అన్నది ఈ govt నే. 
ఒక 350 కోట్లకు పార్టీ ని కలుపుకున్నది ఈ govt యే. 
మీ అయ్య, MLA కాగానే అసెంబ్లీ లో నాకు పోలిటిక్స్ లో ఆదర్శం ఈ CM అని చెప్పింది ఈ govt లోనే.


 అప్పటి govt కి ఇప్పటికి ఒక్కటే ఒక్క YS తప్ప.


 ఇవేవి గుర్తు రాలేదా ఈ కామెంట్ రాసేటప్పుడు? 


 నిన్ను సాక్షి విమర్శింది అని అక్కసుతో కామెంట్ రాసావ్. 


అది కరెక్ట్ అయితే, నమ్మించి ఒటేయించుకొని, మోసం చేసిన మీ అయ్య మీద ఇంకెన్ని కామెంట్స్ వెయ్యాలి ఓటేసిన నేను?

Thursday 10 May 2012

Mexican దృష్టి లో ఇండియా...

ఆఫీసు పని మీద మెక్షికొ వెళ్ళాల్సి వచ్చింది.
అక్కడి మా client తో మాటల్లో మీరు ఇండియాన్స్ లాగే వున్నారు, కళ్ళు, జుట్టు నల్లరంగులో వున్నాయి. శరీర రంగు కూడా చాలా వరకు దగ్గరగా వుంది అన్నాను.


అతను అవును అన్నాడు. ఇంకా మెక్షికొ గురించి ఏమి తెలుసు అని అడిగాడు.


నేను పేపర్ లో చదివినవి , మా ఆఫీసు instructions manual లో వున్న, విన్న విషయాలు చెప్పాను.
మెక్షికొలో మాఫియ ఎక్కువని, parallel govt నడుపుతుందని. దోపిడీ, విదేశీయుల్ని ఎక్కువ కిడ్నాప్ చేస్తారని ఇంకా అన్ని చెప్పాను. వాటితో పాటు నాకు తెలిసిన మాయన్ నాగరికత గురించి కుడా చెప్పా.


సరే అసలు ఇండియా మీద వీళ్ళ అభిప్రాయం ఏమిటో తెలుసు కుందాము అని అడిగా.
అతను 1 నెల ఆఫీసు పని మీద ఇండియా లో ఉన్నాడట. బాగానే ఇక్కడి నాగరికత, జీవన విదానం గురించి చదివింది , విన్నది, చూసింది చెప్పటం మొదలెట్టాడు.


అవును ఆనంద్ , ఇండియా కి మాకు చాలా దగ్గరి పోలికలు వున్నాయి


ఇక్కడ రౌడీ లు మాఫియా leaders అయితే ఇండియా లో రాజకీయ నాయకులు అవుతారు.
లంచం లేనిదే ఏ పని జరగదు ఇండియా లో , ఇక్కడ కూడా అంతే కాని ఇండియా లో ఉన్నంత విచ్చలత్వం లేదు. రౌడీ, రాజకీయం , కళ, వ్యాపారం ఇండియా లో వారసత్వం గా సంక్రమిస్తాయి.
మీకు కొట్టుకోవటానికి కులం, మతం, ప్రాంతం , బాష లాంటి చాలా topics వున్నాయి, కాని మెక్షికొ లో డబ్బు ఒక్కటే కారణం.
మీరు ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే నెహ్రు వంశపు రాచరికపు పాలనలో వున్నారు, కాని ఇక్కడ మాత్రం రాజకీయాలు చాలా చాలా బెటర్.


ఇండియా చట్టం ప్రకారం లంచం తీసుకోవటం,ఇవ్వటం రెండు నేరం. అంటే 99 శాతం పైగా భారతీయులు నేరస్తులు. న్యాయ స్థానం ప్రకారం నేరస్థుడి సాక్ష్యం, లేదా వాదన చెల్లవు. అంటే 99 శాతం పైగా భారతీయుల మాటకు , చెప్పే నీతికి విలువ లేదు అన్నాడు.


ఏమి మాట్లాడాలో తెలియక అక్కడితో ఆ discussion ఆపేసా.


నిజమే అనిపించింది ఇక్కడ ప్రతి వాడు తన గురించి , తన అవినీతి పక్కన పెట్టి మన పక్క పార్టీ, కులం, మతం, బాష , ప్రాంతం వాడి అవినీతి గురించి TV9 వాడి లా శ్రీరంగ నీతులు చెప్పటం గమనించాక.

Tuesday 13 December 2011

జగన్... ఇప్పటికైనా అర్ధమయిందా?

చంద్ర బాబు పై విచారణకు హైకోర్ట్ స్టే  ఇచ్చిన వార్త ను ఇప్పుడే చూసాను ఇంటర్నెట్ లో.
ముందే చెప్పాను నేను ఇంతకూ ముందు నా పోస్ట్ లో. చూసారా అవిశ్వాసం పెట్టినందుకు ఇచ్చిన బహుమతి.

కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ CBI ఢిల్లీ ఆదేశాలను పాటించటం తప్ప ఇంకేమి చెయ్యదు, చేసే దమ్ము నిజాయితి లేదు అనే విషయం ఎన్నో సార్లు రుజువయింది, అవుతూనే వుంటది.


జగన్ ... 
ఇప్పటికైనా అర్ధమయిందా ఈ దేశం లో నకిలీ గాంధీ ఫ్యామిలీ కి ఎదురు తిరిగితే ఏమవుతుందో ...

ఒక MLA కొడుకుగా పుట్టి CM కొడుకుగా ఎదిగిన నీకు సామాన్యుడి బాధలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి గాని, లంచం ఇవ్వకుండా ఒక్కటంటే ఒక్కపని జరగని ఈ అతి పెద్ద అవినీతి దేశం లో, న్యాయం నిస్పక్షపాతం గా జరగదని  మా లాంటి నేలబారు మనిషి / ఓటరు కు ఎప్పుడో తెలుసు.

కావాలంటే ఒక్కసారి కాంగ్రెస్స్ లోకి మరల వస్తాను అని చెప్పు, అదే CBI నీకు హరిశంద్ర అని సత్కరించకుంటే నన్నడుగు. 

కసాబ్ ను, అఫ్జల్ గురు ను కొత్త అల్లుడు లా చూసి , కడుపు కాలి పవార్ ని కొట్టిన సింగ్ పై చర్య లు తీసుకొనే ఈ దేశం లో, ఈ పాలనలో ఇంతకంటే ఏమి ఆశించలేము.

జగన్, చంద్రబాబు కేసు లను ఒకేలా దర్యాప్తు చేస్తుంది అనుకోవటం అత్యాశే.

మించిపోయింది లేదు..

చిరంజీవిని చూసి అయినా రాజకీయం నేర్చుకో జగన్.

Tuesday 6 December 2011

జె.పి నువ్వు రాజకీయం నేర్చావ్!

నువ్వు లోక్ సత్తా పెట్టినప్పుడు తెలివైన వాడు రాజకీయాల లోకి వచ్చాడు రాజకీయాలు కొంచెమైనా మారుతాయి లే అని అత్యాశ పడ్డ నేలబారు తెలుగోడిని. ఎంతోమందికి నీ పార్టీ గురించి చెప్పి గెలిచినా ఓడినా ఒక మంచివాడికి వోట్ వెయ్యాలి అని కొంత మందితో అయినా నీ పార్టీ కి ఓటేసిన , వేయించిన వాడిని.


కాని,


గత కొద్ది నెలలుగా నీ ప్రవర్తన , నిన్న అసెంబ్లీ లో నీ స్పీచ్, నిర్ణయం చూసాకా నువ్వు అందరిలా ఒక రాజకీయ నాయకుడివే అనే నిర్ణయానికి వచ్చా. కాకపోతే మాటలు నేర్చిన, చిలకలా మాటలు మాత్రమే చెప్పి చేతలు ఏమాత్రం చెయ్యని ఒక తెలివైన మాజీ IAS వి.


అయ్యా,


ఎప్పుడో నువ్వే చెప్పిన ఒక నీతిని ఇక్కడ ఉదహరిస్తా. చెప్పే ముందు మనం చేసి చూపించాలి అని గాంధీ చెప్పాడు అన్నావ్ . 


మరీ నిన్ను నమ్మి అసెంబ్లీ కి పంపిన kukatpally ప్రజలను ఎన్ని సార్లు వెళ్లి పలకరించావ్? ఎన్ని సార్లు వాళ్ళ సాధక బాధకాలు తెలుకున్నావ్? అవి పరిష్కరించటానికి ఏమి చేసావ్?  సమస్యల మీద ఎన్ని సార్లు సమ్మె చేస్సావ్, ప్రభుత్వాన్ని నిలదీసావ్? ప్రజలను చైతన్య పరిచావ్? 


చెప్పాలంటే ఏమి చెయ్యలేదు , ఏమి అంటే ఏమి చెయ్యలేదు, కనీసం చెయ్యాలన్న సంకల్పం లేదు.


  ఎప్పుడో IAS కు ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివినది గుర్తుకు వచ్చిందేమో నిన్న నే అసెంబ్లీ లో ఇంకో నీతి చెప్పావ్. MLA నియోజక వర్గ ప్రజల అవసరాలు తీర్చాలట, వారి అభివృద్దికి పాల్పడలట, నిధులని దుర్వినియోగం చెయ్యకుండా కర్చుపెట్టాలట, పారదర్సికత ఉండాలట.


నీ నియోజక వర్గ అభివృద్దిని, నీకు నీ నియోజక వర్గం పట్ల వున్నా నిబద్దతని ,రాజకీయాల పట్ల నీ చిత్తశుద్దిని  ఒకసారి పరిశీలిస్తే నీ మాటలు పేద్ద బాలశిక్షను మించిన నీతులు గా కనిపిస్తున్నాయి ప్రతిసారి రాజకీయ నాయకుల చేతిలో ఓడిపోతున్న నాలాంటి నిస్సహాయ ఓటరుకు.


తెలంగాణాకు వ్యతిరేకం అన్నావ్. దెబ్బ పడగానే దెయ్యం దిగిందేమో వ్యతిరేకం కాదన్నావ్.
ఏంటయ్యా జెపి  ఇది? ముందు నువ్వు ఇచ్చిన నీతులు వివరణ తప్పు అనిపించిందా లేక భయమేసింద?


అసెంబ్లీ లో నిన్న నే చెప్పిన ఇంకో జోక్ ను చెప్తాను ఇప్పుడు.
కిరణ్ విలువల కోసం పాటు పడుతున్నాడట? ఈమాట చెప్తున్నప్పుడు నీలో నువ్వే నవ్వుకొని వుంటావ్ ఖచ్చితంగా, MLA ల ను అవిశ్వాసానికి వ్యతిరేకం గా ఓటు వెయ్యమని సూట్ కేసు లు పంపిన విషయం గుర్తొచ్చి. నీకు కూడా సూట్ కేసు అందిందేమో అని నా డౌట్ నిన్న నువ్వు తటస్తంగా వుండటం చూసాక. తటస్తంగా అంటే అనుకూలంగా అని నీకు తెలియదా, లేకా జనాలు ఇంకా అర్ధం చేసుకొనే స్థితిలో లేరు అనుకున్నావా?


పోయిన ఎలక్షన్ లలో అందరికి చెప్పినట్లే మా నాన్నకు కుడా చెప్పాను నీకు ఓటు వెయ్యమని.


ఒక నవ్వు నవ్వి  అందరు రంగు మార్చిన రాజకీయ వుసర వెల్లులు. ఈయన రంగు ఇంకా మార్చని వుసరవెళ్లి , అంతే కాని రంగు మార్చటం చేతకానో , చెయ్యలేనో వ్యక్తి కాదు రా అన్నాడు.


ఆ నవ్వుకు అర్ధం నిన్న ఇంకా బాగా అవగతం అయింది.


ఇంకెప్పుడు నీతులు చెప్పకు. వెగటు పుడుతుంది నాలాంటి నేలబారు ఓటరుకి.


Tuesday 15 November 2011

మంత్రుల జీత, భత్యాలు పెరుగుతున్నాయి.

మా ముత్తాతల కాలం లో వ్రాసుకున్న మన రాజ్యాంగం ఇచ్చిన అతి పెద్ద అవకాశం.
ఎవరికీ లేని అవకాశం మన రాజకీయ నాయకులకు వుంది, తన జీతాలను తనే పెంచుకొని ఆమోదించుకొనే అద్బుత అవకాశం.


అయ్యా,
చచ్చి చెడి 18 సంవత్సరాలు చదివి , మంచి మార్కుల తో డిగ్రీ తెచ్చుకొని, ఆ తర్వాత ప్రతి రోజు 10 గంటలకు తగ్గకుండా పని చేసి వర్షానికి ఒకసారి జీతం పెంచామనటానికి manager తో గొడవ. ఇంత చేసినా పెరుగుతుందనే గ్యారంటీ లేదు.


మరి...
ఏమి పీకారని ఈ మంత్రులకు (ఈ మాట అనటానికి మనసు రావటం లేదు) జీతాలు పెంచాలి.
బూతులు బాగా తిడుతున్నందుకా? తిట్టుకుంటూ ఉన్నందు కా?
GAS, PETROL, TAX , VAT బాగా పెంచినందుకా?
JOBS రాకుండా సమర్ధవంతంగా అడ్డుకున్నందుకా?
గత 2 ఏళ్ళుగా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తున్నందుకా?
అక్కడ ఇక్కడ సమ్మెలు చేసి జనాల్ని విజయవంతం గా విడదీశారనా?
లేకా కుంభకోణాలు చేసరనా?


ఎందుకు పెంచాలి రా?


తిట్టుకోవటం తప్ప ఏమి చెయ్యలేని నాలాంటి వోటర్ మీది నమ్మకం కాబోలు.


తరాలు మారటం తప్ప, ఈ రాజకీయం మారదు, నాయకులు మారరు, వారసత్వం మారదు.


అన్ని ఆ త్రాసులోని కప్పలే.

Monday 14 November 2011

బాబు, మీరెందుకు మాట్లాడుతున్నారు? మన పత్రికలూ, టివి లు మాట్లాడు తాయిగా....

ఇది ప్రజాస్వామ్యం పై దాడి.
ఇది పత్రికా స్వేఛ్చ పై దాడి.

అయినా అన్నా హజారే అన్న లాంటి మీ మీద CBI ఎంక్వయిరీ నా?

అయినా మీరెందుకు సమాదానం ఇస్తున్నారు?
మన టివి లు మాట్లాడుతాయి. మన పత్రికలూ వ్రాస్తాయి.
మీరు respond అవటం రామోజీ కి , ఆర్ కే కి, CM కిరణ్ కు, నాకు చాలా బాద కలిగిస్తుంది.
మా పత్రికలకు , ప్రభుత్వాని కి ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నారు, మేము help చెయ్యలేమని ఎందుకు అనుకుంటున్నారు? సిబిఐ మనదే వర్రీ కాకండి.

జగన్ పై ఎంక్వయిరీ అంటే ఓకే, నీపై ఎంక్వయిరీ నా, మీరు ఏదో ఒకటి చెయ్యండి.
మా తరఫున మేము ఏమి చెయ్యగలమో అది చేస్తాం.

Monday 3 October 2011

తండ్రి అయితే గాని తెలిసి రాలేదు.!

 మేన మామ అంటే రామ్ కు చాలా ఇష్టం.

చిన్నప్పటి నుంచి ప్రతి పనిలో , ప్రతి విజయం మామ ఉండేవాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమామ అనేదానికి పెర్ఫెక్ట్ ఉదాహరణ మామ. కాబట్టి రామ్ మనసులో తన పిల్లలకి కూడా తన మామ లాంటి మేన మామ ఉండాలి 
అనేది కోరిక.



6 సంవత్సరాల క్రితం ....


పెళ్లి చూపులు చూసి వచ్చావ్. Updates ఏమిటిరా రామ్? అడిగాడు శ్రీకాంత్.
అమ్మాయి ఒక్కటే , అన్నా తమ్ముళ్ళు ఎవరూ లేరు శ్రీకాంత్ .

నేను అడిగింది అమ్మాయి గురించి వాళ్ళ బ్రదర్స్ గురించి కాదు అన్నాడు శ్రీకాంత్.

ఈ  అమ్మాయిని చేసుకుంటే నాకు మా మామ వున్నట్లు నా పిల్లలకు మేన మామ ఉండడురా  శ్రీకాంత్ అన్నాడు  రామ్. 

శ్రీకాంత్ 
నవ్వి, అది ఆ అమ్మాయి తప్పు కాదుగా? అది ఆ అమ్మాయి చేతిలో గాని వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో  గాని లేనిది. అయినా లేనిదాన్ని వున్నట్లుగానో, చెప్పవలసిన విషయాన్ని దాచిపెడితెనో తప్పుగాని ఇది  ఆలోచించాల్సిన  పాయింటో, వద్దు అని చెప్పేంత పెద్ద కారణం కాదు అన్నాడు.

ఏమో శ్రీకాంత్ నన్ను నేను సముదాఇంచుకోలేక  పోతున్నాను  అన్నాడు  రామ్ .

రామ్
, అమ్మాయి  వాళ్ళు  అడుగుతున్నారు  ఏమి  చెప్పమంటావురా  అన్నాడు  మేనమామ .

నీకు తెలుసుగా మామ బ్రదర్స్ లేరు , పైగా ఒక్కటే కూతురు. వాళ్ళ అమ్మా నాన్నను  నేనే సాకలేమో 
ముసలోళ్ళు  అయ్యాక?

వాళ్ళు నాకు  బాగా  తెలుసురా. నీ మీద ఆధారపడే మనుసులు కాదురా వాళ్ళు అన్నాడు  మామ. రామ్  అజ్ఞానాన్ని , అతి
 తెలివిని చూసి నవ్వుతూ.

అయినా తనను తానూ ఒప్పించుకోలేని రామ్ ఆ సంబంధం వద్దు అని చెప్పేశాడు.


ఇప్పుడు....

ఏరా ఆనంద్ అమ్మాయిని చూసి వచ్చావట, ఏమిటి విశేషాలు?
నచ్చిందా ఆ
 అమ్మాయి, నువ్వు నచ్చావా  ఆ అమ్మాయికి?

అమ్మాయి బాగుందిరా .
ఏమి చదివింది ఏమి?
ఇంజనీరింగ్ చేసిందటరా.
జాబ్ చేస్తుందా?
హ ...infy లో  చేస్తుంది.

మరి లేట్ ఎందుకు? ప్రాబ్లం ఏమిటి  కట్నం తక్కువ ఇస్తామన్నారా ఏమిటి?

అమ్మాయి ఒక్కటే కూతురు
. బ్రదర్స్ సిస్టర్స్ లేరు అట రా.

మంచిదే కదా ఆస్తి మొత్తం నీకే వస్తుంది.

నీ బొంద, ఆ పిల్లను  చేసుకుంటే  వాళ్ళ  అమ్మా  నాన్నను నేనే సాకాలి. కష్టంరా
.  ఆస్తి అ తర్వాతి మాట. అందుకే వద్దు అని చెప్పుదాము అనుకుంటున్నా.

ఈ సంభాషణ విన్న రామ్  పక్కలో  బాంబు  పడినట్లు  అయింది
.
ఎందుకంటే  రామ్  ఇప్పుడు  తండ్రి  కాబట్టి. ఒక్కరే ముద్దు ఇంకొకరు వద్దు అనుకుంటున్నాడు కాబట్టి. అంటే తన  కూతుర్ని చేసుకోబోయే వాడుకూడా ఇలాగే ఆలోచిస్తాడా అనే  ఆలోచన  మొదలైంది  కాబట్టి.

కావచ్చును  కాకపోవచ్చును.....

 సరిగా  ఒక  6 సంవత్సరాల  క్రితం  తన  మాటలు  గుర్తొచ్చాయి  రామ్ కి .
తన ఆలోచనలు మాటలు ఎంత  చెడో , బాధో బాగా తెలిసొచ్చింది.